జగిత్యాల జిల్లా కోరుట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలో ఓవ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. పట్టణంలోన నివాసముంటున్న రమేష్, గంగాధర్‌లు స్నేహితులు. గంగాధర్ రమేశ్ అవసరం నిమిత్తం డబ్బు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వాలని గంగాధర్ స్నేహితుడు రమేశ్ ఇంటికి వెళ్లి అడిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కోపోద్రిక్తుడైన రమేశ్ స్నేహితుడు గంగాధర్‌ను కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. గాయలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 36 గంటల దీక్షకు సిద్ధమైన కాంగ్రెస్