ETV Bharat / state

విషజ్వరాలతో మంచంపట్టిన జగిత్యాల జిల్లావాసులు - FEVERS

జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు జ్వరాలతో వణికిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జ్వరాలతో మంచాన పడ్డారు. గొడిశెలపేట, పాతగూడూర్ గ్రామాల్లో అయితే పరిస్థితి మరీదారుణం. కొందరు మలేరియా, మరికొందరు డెంగీతో బాధపడుతుంటే... ఇంకొందరు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు. వీటన్నిటికి ముఖ్య కారణం దోమలేనని గ్రామస్థులు చెబుతున్నారు.

విషజ్వరాలతో మంచంపట్టిన జగిత్యాల జిల్లావాసులు
author img

By

Published : Aug 26, 2019, 7:47 PM IST

విషజ్వరాలతో మంచంపట్టిన జగిత్యాల జిల్లావాసులు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గొడిశెలపేట, పాతగూడుర్ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వరాల బాధితులే కనిపిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా మంచాన పడ్డారు. సుమారు రెండు వందల మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. సరైన చికిత్స లేక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే మరికొందరు ఆర్​ఎంపీల వద్దకు వెళ్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు కలుషిత నీరు తాగడం, శానిటేషన్ లోపం, రాత్రి వేళల్లో విద్యుత్ లేక దోమలు దండయాత్ర చేయడం వల్ల ఈ దుస్థితి దాపురించిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఆదేశాలతో వైద్య శిబిరం ఏర్పాటు

విషయం తెలుసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 300 మందిని పరీక్షించినట్లు వారిలో ఎక్కువ మంది వైరల్ ఫీవర్ వల్ల బాధపడుతున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు వివరించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

గ్రామంలోని ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని వైద్యులు సూచించారు. దోమలు ఉండడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఇవీ చూడండి: 'సింధు గెలుపు.. క్రీడారంగంలో గొప్ప మలుపు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.