జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో.. లాక్ డౌన్ వేళ మూగజీవాలకు తినేందుకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ఆలయం మూసివేసినందున.. కొండపైకి భక్తులెవరూ రావడం లేదు. ఆహారం అందిచేవారు లేకపోవటంతో.. కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. ఎండలో నీరసించిపోయిన పలు వానరాలు.. మృత్యువాత పడ్డాయి.
ఆలయ పరిసర ప్రాంతాల్లో.. కనీసం తాగునీటి వసతి కూడా అందుబాటులో లేకపోవడం వల్లే వానరాలు చనిపోయాయని స్థానికులు వాపోతున్నారు. జంతు ప్రేమికులు అప్పడప్పుడు వెళ్లి పండ్లు అందిస్తున్నప్పటికి.. అవి వాటికి ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు. ప్రభుత్వమే మూగజీవాలను కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: చేపల చెరువులో కొండ చిలువ కలకలం..!