వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ముందుగా ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల ప్రజావాణిలో రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు.
ఓ వైపు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మించి ఇప్పుడు వరి ధాన్యం కొనమని చెప్పడమేంటని ప్రశ్నించారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం పప్పుదినులకు బోనస్ ప్రకటించాలని కోరారు. లీటరు పాలకు ప్రభుత్వం అందజేసే రూ. 4ల ప్రోత్సాహకం కరీంనగర్ డెయిరీ పరిధిలో రావటంలేదన్నారు. వెంటనే కరీంనగర్ పాడి రైతులను ఆదుకోవాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగళ్లు చెపట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండు చేశారు.
దేశంలో స్వాతంత్య్ర అనంతరం కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కనీస మద్దతు ధరను నిర్ణయింపజేయడమే కాకుండా రైతులందరికీ ఆ కనీస మద్దతు ధరను కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. కానీ దురదృష్టకరం ఏమిటంటే కేంద్రంలోని ప్రస్తుత భాజపా ప్రభుత్వం కనీస మద్దతు ధరను కల్పించలేకపోతుంది. మరోవైపు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మించిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం కొనమని, వేరే పంటలు పండించాలని ప్రకటించింది. ఆయిల్ పాం తోటలు పెట్టాలని చెబుతుంది. కానీ ఆయిల్ పాం పంట చేతికి రావాలంటే మెుక్క నాటినప్పటినుంచి 4ఏళ్లు పడుతుంది. రైతులు అంతవరకు పెట్టుబడులు పెట్టాలంటే కష్టం. వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ముందుగా ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలి.- టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: Harish rao campaign: హుజూరాబాద్‌లో దూసుకెళుతున్న కారు.. ఆకట్టుకుంటున్న హరీశ్ ప్రచారం!