జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి నేటి సాయంత్రం కవిత మరోసారి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు కొండగట్టు వచ్చి.. కాలినడకన ఆలయం వరకు చేరుకుంటారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 80 రోజుల పాటు సాగేలా రూపకల్పన చేసిన హనుమాన్ చాలీసా అఖండ పారాయణం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
హనుమాన్ చాలీసా అఖండ పారాయణం నిర్వహించేందుకు ఆలయ సన్నిధిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భూమి పూజ చేసిన కొండగట్టులోనే నిర్మించనున్న రామకోటి స్తూపం పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇవీచూడండి: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: కవిత