నియంత్రిత సాగుతో పేరుతో నిర్బంధ సాగు చేపట్టడం సరికాదని.. ముందుగా రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఈ సారి విత్తనాల ధరలు పెరిగాయని.. రాయితీ తొలగించారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సన్నరకాలు సాగు చేయాలంటున్న సీఎం కేసీఆర్ క్వింటాల్‌కు రూ.2500 ప్రకటించాలి. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంగా పంపిణీ చేస్తే ఇటు వినియోగదారునికి, అటు రైతుకు మేలు జరగుతుంది. ఈ విధంగా చేస్తే సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తాం. మంచి పనికి మేము ఎప్పుడైనా మద్దతిస్తాం. - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు