ETV Bharat / state

'మరణ వాంగ్మూలాన్ని మంత్రి తప్పుపట్టడం బాధాకరం' - jagityala district latest news

కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి జగిత్యాలలో డిమాండ్​ చేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాలో సాయంత్ర 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించాలన్నారు.

mlc jeevan reddy demand for corona treatment merge in arogya sri in jagityala
కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జీవన్​ రెడ్డి
author img

By

Published : Jun 30, 2020, 2:09 PM IST

సెల్ఫీ తీసుకుని మరణ వాంగ్మూలంతో ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందితే.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించకుండా మంత్రి ఈటల రాజేందర్‌ సెల్ఫీ వీడియోను తప్పు పట్టడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. కరోనా నివారణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ స్పందించపోవటం బాధాకరమన్నారు. సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్​ చేశారు.

దురదృష్ట ఘటనలను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఒకవేళ హెచ్​ఆర్​సీ స్పందించకపోతే తామే కలుస్తామన్నారు. కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్‌ వైద్యం అందించాలని కోరారు.

కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జీవన్​ రెడ్డి

ఇదీ చదవండి: 59 చైనా యాప్​లపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.