ETV Bharat / state

లయన్స్ క్లబ్‌ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ సేవలు పేదల పాలిట వరంగా మారాయని కొనియాడారు.

mla vidya sagar rao inaugurates  free tailoring training centre for woman at metpally
లయన్స్ క్లబ్‌ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు
author img

By

Published : Oct 19, 2020, 4:47 PM IST

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ సేవలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అభినందించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సేవలు పేదల పాలిట వరంగా మారాయని కొనియాడారు. ఇలాంటి స్ఫూర్తితోనే రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేద కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

నిరంతర సేవలు

కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రం నిరంతరం కొనసాగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగుల మురళి తెలిపారు. 40 మంది చొప్పున రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి... ధ్రువీకరణ పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వారికి కుట్టు మిషను ఉచితంగా అందిస్తామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.