జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో కరోనాతో మరణించిన వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా తిప్పయ్యపల్లి, నల్లగొండ, చెప్యాల, రామకిష్టాపూర్, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించారు.
వైరస్ సోకిన వారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. ఇరుగు పొరుగు అండగా ఉండాలని సూచించారు. అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లో మహిళామణులు.. వాటా పెరుగుతోందా? తగ్గుతోందా?