ETV Bharat / state

వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా లాక్​డౌన్​తో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరుకులు పంపిణీ చేశారు.

సరుకులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
సరుకులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
author img

By

Published : May 1, 2020, 8:23 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో వలస కూలీలకు, కార్మికులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నెలకు సరిపడా కిరాణా సామగ్రి అందించారు. అనంతరం కార్మికులకు మే 'డే' శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.

వ్యక్తిగత పరిశుభ్రత...

కరోనా వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. మాస్కులు ధరించి అవసరం మేరకే బయటకు రావాలని కార్మికులకు సూచించారు. ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్​డౌన్​ను కట్టు దిట్టంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా బారిన పడినవారి సంఖ్య తక్కువగానే ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ఉనికే లేకుండా చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి : భారత్​కు వచ్చేందుకు ఒక్కరోజే 32 వేల మంది దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.