ETV Bharat / state

పరిహారం చెల్లింపునకే తొలి ప్రాధాన్యత : మంత్రి కొప్పుల

ఎల్లంపల్లి, కాళేశ్వరం భూ నిర్వాసితులకు ఇళ్లే కాకుండా.. ఇంటి పరిసర ప్రాంతాల్లో షెడ్లు, పైపు లైన్లు, బావులు, ఇతర నిర్మాణాలకూ పరిహారం అందేలా చూడాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో ముంపు గ్రామాలకు పరిహారంపై సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Feb 3, 2021, 9:31 AM IST

minister-koppula-eshwar-review-on-compensation-for-flooded-villages
పరిహారం చెల్లింపునకే తొలి ప్రాధాన్యత

ఎల్లంపల్లి, కాళేశ్వరం భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలోని ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితుల పరిహారంపై కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన చెగ్యాం, తాళ్లకొత్తపేట, జగదేవపేట, రాజక్కపల్లె, వెల్గటూర్, రాంనూర్, కొత్తపేట, నామాపూర్, కోటిలింగాల, ముక్కట్రావుపేట గ్రామాల భూ నిర్వాసితులు వారి సమస్యలను మంత్రికి వివరించారు.

బాధితులకు పరిహారాన్ని చెల్లించడానికి అధికారులు మొదటి ప్రాధాన్యత కల్పించాలని మంత్రి కొప్పుల సూచించారు. 2015 వరకు 18 ఏళ్లు నిండిన సుమారు 150 మందికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో కేవలం ఇల్లే కాకుండా.. చెట్లు, పైపులైన్లు, బావులు, షెడ్లు, ఇతర నిర్మాణాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

భూ నిర్వాసితులు సకాలంలో సంతకాలు చేయకపోవడం వల్లే.. పరిహారం చెల్లింపులో కొంతమేర ఆలస్యం జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల ప్లాట్లు, పట్టా భూములను వారంలోగా లబ్ధిదారులకు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంత్రి హామీతో భూములు కోల్పోయిన గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.