పల్లె ప్రగతి కార్యక్రమం వల్లే గ్రామాలకు కరోనా అంతగా పాకలేదని.. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో 8 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నియంత్రిత సాగులో భాగంగా ఓ రైతు పొలంలో దిగి విత్తనాలు చల్లారు.
ఓ వైపు దేశమంతా కరోనా విజృంభిస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అంతగా లేదు. కొన్నినెలలుగా ఆదాయం లేకున్నా రైతుబంధు, రుణమాఫీ నిధులు ఇచ్చారు. పల్లె ప్రగతితో పల్లెలు అభివృద్ధి సాధించాయి. -మంత్రి ఎర్రబెల్లి
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: అందుకోసమే 8 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం: పువ్వాడ