గ్రామ సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేయడం చూశాం. కానీ ఇప్పుడు వీధుల్లో కూడా ముళ్ల కంచెలు వేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలిక పరిధిలోని పలు వీధుల్లో ప్రజలు ముళ్ల కంచెలు ఇనుప చువ్వలు బండరాళ్లు, కర్రలు అడ్డుపెట్టారు. కొత్త వారిని లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
మెట్పల్లిలో ఏ వీధికి వెళ్లాలన్నా ఇప్పుడు ముళ్ల కంచెలే కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వీధుల్లోకి ఆంబులెన్స్ రావడం కష్టంగా మారే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?