ETV Bharat / state

అభివృద్ధి సాధించారు.. కేంద్రమంత్రి ప్రశంసలు పొందారు.. - కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వార్తలు

నాడు ఆ గ్రామం మారుమూల పల్లె. అభివృద్ధికి ఆమడ దూరంలో గుర్తింపు లేకుండా ఉండేది. నేడు దిల్లీ వరకు పేరు వినిపించేలా అభివృద్ధి సాధించింది. గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్థుల సమిష్ఠి కృషితో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అభివృద్ధిని సాధించారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూనే... ఉన్నత అధికారులతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి వెళ్లారు. ఆ గ్రామం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే మరి..

metla-chittapur-village-turns-role-model-for-so-many-villages-in-jagtial-district
అభివృద్ధి సాధించారు.. కేంద్రమంత్రి ప్రశంసలు పొందారు..
author img

By

Published : Mar 5, 2021, 2:41 PM IST

ఎత్తయిన కొండలు పరుచుకున్న పంటలు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని అందిస్తుంది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉన్న మెట్ల చిట్టాపూర్ గ్రామం. అభివృద్ధిలో ప్రగతి సాధించి... ఆదర్శ గ్రామమని స్వయానా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించేలా రూపుదిద్దుకొంది. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ... గ్రామ ప్రజలందరిని ఒకటిగా చేస్తూ... గ్రామాన్ని అన్ని వైపులా అభివృద్ధి బాటలో నడిపింది పాలకవర్గం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తూ... ఇప్పటికీ సుమారు 30 వేల వివిధ రకాల మొక్కలను నాటి... వాటిని పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పక్కా ప్రణాళికతో..

1,975 జనాభా ఉన్న మెట్ల చిట్టాపూర్ ఓడీఎఫ్ ప్లస్ గ్రామంగా ప్రకటించడంతో పాటు... పల్లె ప్రగతిలో ఆదర్శ గ్రామంగా నిలిచింది. గ్రామంలో 100% ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి... మరుగుదొడ్లు సైతం నిర్మించారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డును నిర్మించారు. ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేసి... ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. కంపోస్ట్ షెడ్డు నిర్మించి సేంద్రియ ఎరువు సైతం తయారు చేస్తున్నారు.

metla-chittapur-village-turns-role-model-for-so-many-villages-in-jagtial-district
సేద తీరేందుకు వీలుగా..

ఎటు చూసినా పచ్చదనమే..

పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేసి అందులో రకరకాల పూల మొక్కలను నాటి పెంచుతున్నారు. గ్రామస్థులు సేదతీరేందుకు కావలసిన సౌకర్యాలను కల్పించారు. రైతు భవనాన్ని ఏర్పాటు చేసి... రైతులకు సంబంధించిన పథకాలను చిత్ర రూపంలో ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. కొత్తగా గ్రామానికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తోంది. గ్రామ పంచాయతీ భవనాన్ని... కార్పొరేట్ భవనం మాదిరిగా తీర్చిదిద్దారు.

metla-chittapur-village-turns-role-model-for-so-many-villages-in-jagtial-district
రైతు వేదిక..

కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టడం కాకుండా... ప్రజల ఆరోగ్యం వైపు కూడా పాలకవర్గం దృష్టి సారించారు. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ... గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోణంలోనే వీరు చేసిన అభివృద్ధిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో... కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోస్ట్​ను పరిశీలించి... ఈ నెల 21న ట్వీట్ చేశారు. స్వచ్ఛభారత్ లక్ష్యం దిశగా అడుగులు వేసి.. ఆదర్శ గ్రామంగా పరివర్తనం చెందిందని ప్రశంసించారు. తమ గ్రామాన్ని కేంద్రమంత్రి ప్రశంసించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడిస్తున్నారు.

ఇదీ చూడండి: 'అంధకార జీవితాన్ని... అతడు అందంగా మలిచాడు'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.