Vaccine Rejected: కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఏకైక మార్గమని వైద్యాధికారులు చెబుతుంటే.. టీకా మత్తు మందు.. నేను వేసుకోను.. ఒత్తిడి చేస్తే గ్రామం వదిలిపెట్టి పోతానంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటుచేసుకుంది. ఇంటింటికి తిరుగుతూ టీకాలు పంపిణీ చేస్తున్న సిబ్బందికి వింత పరిస్థితి ఎదురైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.... తాను టీకా వేసుకోనని తెగేసి చెప్పగా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు.
Vaccine Rejected: గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. ఉన్నతాధికారులు కూడా ఇంటింటికి తిరుగుతూ టీకాల కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. తాటిపల్లి గ్రామంలో 50 సంవత్సరాల.. రొండి ఎల్లయ్య ఇంటికి వెళ్లారు. తాను టీకా తీసుకోబోనని హంగామా చేశాడు. దీంతో స్థానిక సర్పంచ్ భర్త బింగి వేణు, వైద్య సిబ్బంది వ్యాక్సిన్ మంచిదని తప్పనిసరిగి వేసుకోవాలని నచ్చచెబుతూ బతిమలాడినప్పటికీ అతను టీకా తీసుకోలేదు. ఎంతకీ వినకపోవడం వల్ల వారు సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో ఏకంగా ఇంటికి గొళ్లం పెట్టి అదృష్యమయ్యాడు.
ఇదీ చూడండి: ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!