సిబ్బందికి పనిభారం
కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మెట్పల్లి డివిజన్ కార్యాలయాన్నే సంప్రదించాలి. సిబ్బంది కొరతతో పనిభారం పెరిగి ఉన్న ఐదుగురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వారిలోనూ ఇద్దరు ఫైర్మెన్లు మాత్రమే ఉండడం వల్ల భారీ ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.
అవగాహన కార్యక్రమాలు గగనమే
ఉద్యోగుల లేమితో అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జాప్యం జరుగుతోంది. నలుగురు డెఫ్యుటేషన్పై వెళ్లడం వల్ల సమస్య ఏర్పడిందని సిబ్బంది చెబుతున్నారు.
వేసవి తీవ్రతను గుర్తించి మెట్పల్లి కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని అటు సిబ్బంది, ఇటు స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :నిజాంపేట్లో ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం