ETV Bharat / state

KTR Speech in Dharmapuri : 'కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా' - జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR Speech in Dharmapuri Public Meeting : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని తెలిపారు. పార్టీ ఏ స్థితిలో ఉన్నా.. కొప్పుల ఈశ్వర్‌ మాత్రం కేసీఆర్‌తోనే ఉన్నారని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన మనవాళ్లు ఎవరో తెలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.

KTR Speech In Dharmapuri Public Meeting
KTR Speech
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 4:48 PM IST

Updated : Oct 3, 2023, 7:45 PM IST

KTR Speech in Dharmapuri Public Meeting : తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ధర్మపురిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతాశిశుకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ వ్యవసాయ వర్సిటీ(Agriculture University)కి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేేశారు. వెల్గటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ పెడితే యువతకు ఉపాధి దొరుకుతుందని అనుకున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ చుట్టుపక్క గ్రామాల వారిని కాంగ్రెస్ వాళ్లు రెచ్చగొట్టారని ఆరోపించారు. అందుకే సోమవారమే మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశ్రమ పెట్టడం లేదని ప్రకటించారన్నారు.

Minister KTR Fires on PM Modi : కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) చెప్పినట్లుగానే పరిశ్రమ స్థానంలోనే వ్యవసాయ వర్సటీ కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. 2004లో తెలంగాణ ఇస్తామని ప్రకటించి.. 2014 వరకు 1400 మంది చనిపోవడానికి కారణమయ్యారని కాంగ్రెస్(Telangana Congress)​పై ఫైర్ అయ్యారు. 'మీరు ఆలోచించండి.. కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా' అని ప్రజలను అడిగారు. నమో అంటే తెలుసా.. నయా మోసగాడు.. ఆకాశంలో నిత్యావసర ధరలు చేరుకున్నాయని మంత్రి విమర్శించారు. సిలిండర్ 400 ఉన్నప్పుడే నానా బూతులు తిట్టాడు కదా.. 1200 చేసిన మోదీకి ఎలా తిట్టాలో మీరే చెప్పాలని సూచించారు. బీజేపీ(BJP) గత తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదని ముస్లిం హిందూ.. పాకిస్థాన్, ఇండియా రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారో చెప్పాలని ధ్వజమెత్తారు.

KTR on Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌ ఎన్నో ఏళ్లు సింగరేణి కార్మికులుగా పనిచేశారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఏ స్థితిలో ఉన్నా.. కొప్పుల ఈశ్వర్‌ మాత్రం కేసీఆర్‌తోనే ఉన్నారని తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని 15 ఏళ్ల క్రితమే చెప్పిన గొప్ప నేత కొప్పుల ఈశ్వర్‌ అని కేటీఆర్ చెప్పారు. చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయని.. అలాగే పార్టీ బాగున్నప్పుడు చాలా మంది వస్తారని వ్యాఖ్యానించారు.

'కొప్పుల ఈశ్వర్‌ ఎన్నో ఏళ్లు సింగరేణి కార్మికులుగా పనిచేశారు. పార్టీ ఏ స్థితిలో ఉన్నా.. కొప్పుల ఈశ్వర్‌ కేసీఆర్‌తోనే ఉన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని 15 ఏళ్ల క్రితమే చెప్పిన గొప్ప నేత కొప్పుల ఈశ్వర్‌. చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయి, పార్టీ బాగున్నప్పుడు చాలా మంది వస్తారు. తెలంగాణ సాధనలో తెరాస ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన మనవాళ్లు ఎవరో తెలుస్తుంది.' -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

Minister KTR Dharmapuri Public Meeting : కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన మనవాళ్లు ఎవరో తెలుస్తుందని పేర్కొన్నారు. ధర్మపురిలో పరిశ్రమ ఏర్పాటుకు కొప్పుల ఈశ్వర్‌ ఎంతో ప్రయత్నించారని చెప్పారు. కొందరు రైతులను రెచ్చగొట్టి ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. రైతుబంధు పథకం(Rythu Bandhu Scheme) కింద రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేసిన ప్రభుత్వం.. కేసీఆర్ సర్కార్ అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

KTR Speech in Dharmapuri కాళేశ్వరం కావాలా.. శనిశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా

KTR Speech Jagtial Tour Today : 'జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేసే బాధ్యత నాది'

Last Updated : Oct 3, 2023, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.