జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తైన సందర్భంగా పంచామృత అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో వైకుంఠవాసుణ్ని అందంగా అలంకరించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
- ఇదీ చూడండి : 'ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన'