జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పర్యటించారు. రేగుంటలో బీటీ రోడ్డు నిర్మాణం, ఇబ్రహీంపట్నంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 30 రోజుల ప్రణాళిక ద్వారా పల్లెలు అందంగా తయారయ్యాయని అన్నారు. పట్టణాలను కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల పూర్తి స్థాయి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : పంట పొలాల్లో విల్లు సంధిస్తున్న ఆదివాసీలు