జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్ప ఆలయంలో మణికంఠుని పడి పూజ ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కే. విద్యాసాగర్ రావు ఆయన సతీమణి పాల్గొన్నారు. గురు స్వామి చక్రవర్తి ఆధ్వర్యంలో పడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అయ్యప్ప స్వామి పడిపూజ వేడుకలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామి భజనలతో ఆలయమంతా మారుమోగింది.
ఇదీ చూడండి: ఎంత నీరు అవసరమో చెప్పండి: కృష్ణా బోర్డు