జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం గత 45 రోజులుగా భక్తులు లేక వెలవెలబోతోంది. భక్తులు ఇచ్చే తినుబండారాల కోసం కొండగట్టు ఆలయం ప్రాంగణంలో సందడి చేసే కోతులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి.
లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న మూగజీవాల బాధ అర్థం చేసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర సతీమణి స్నేహలత, కూతురు నందిని కోతులకు అరటి పండ్లు అందించి ఆకలి తీర్చారు. కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందలాది మూగజీవాలకు పండ్లు అందించి ఆకలి తీరుస్తున్నట్టు మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత తెలిపారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష