ఆరేళ్లలో తెరాస ప్రభుత్వ పాలనలో ఆరువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని ఇదేనా తెలంగాణ ప్రగతి అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి సర్కారు పనితీరును విమర్శించారు.
కేవలం రైతు బంధు తప్ప.. రైతులకు చేసింది ఏమిలేదని.. మీకు సహకార సంఘాల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. గెలువండి కానీ ముందుగా రైతులకు రుణమాఫీ, వడ్డీ రాయితీ ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ రైతులను ఓట్లు ఎలా అడుగుతున్నారని జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో విమర్శించారు.
కేంద్రంపై నెపం నెట్టి పసుపు పంటకు మద్దతు ధర పట్టించుకోవటంలేదని.. పక్కనున్న ఏపీ ప్రభుత్వ రూ. 6,850 మద్దతు ధర ఇస్తున్న విషయం సీఎం కేసీఆర్ తెలుసుకుని మన రైతులను ఆదుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు