Deepthi Murder Case Updates : జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి అనుమానాస్పద మృతి (Deepthi Murder Case) కలకలం రేపిన విషయం తెలిసిందే. దీప్తి మృతి చెందిన రోజు ఆమె చెల్లెలు చందన ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా నిజామాబాద్ వెళ్లారంటూ ప్రచారం జరిగినా..ఆ సీసీ ఫుటేజీలో ఉన్నది వారు కాదని తేలింది.
ఈ మేరకు చందన కోసం పోలీసులు నాలుగు రోజుల నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేపట్టారు. విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద చందన, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన కారు డ్రైవర్, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి..
Korutla Town Deepthi Murder Case Updates : చందనతో పాటు ఉన్న యువకుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరిని కోరుట్లకు తీసుకొచ్చి విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, చందనను అదుపులోకి తీసుకున్న విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..? కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు దీప్తి (24), చందన, ఒక కుమారుడు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్లో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి.. ఇంటి దగ్గరే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్లో వాళ్ల బంధువుల గృహప్రవేశం ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి అక్కడికి వెళ్లారు.
boy suspicious death: పాపం పసివాడు... పండగ వేళ అనుమానాస్పద మృతి
Korutla Young Woman Murder Case Updates : సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ దీప్తి, చందనతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద కుమార్తె దీప్తికి కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. చందనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమిచ్చారు. వారువచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉండటాన్ని గమనించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్డ్రింక్ బాటిళ్లు, తినుబండరాల ప్యాకెట్లు ఉన్నాయి.
చందన కోసం చూడగా తను ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిసింది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా చందన, ఓ యువకుడు కలిసి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. ఆ తర్వాత అది వారు కాదని తేలింది. దీప్తి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు మృతురాలు దీప్తి శరీరంపై గాయాలున్నట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు. దీంతో ఈ కేసులో పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది.
Boy Suspicious Death in Shamshabad : పెళ్లివేడుకలో బాలుడి అనుమానాస్పద మృతి.. ఏమై ఉంటుంది..?
4 Years Girl Suspicious Death in Medchal : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 4 ఏళ్ల చిన్నారి