జగిత్యాల జిల్లాలో ఈ వానాకాల సీజన్‌లో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 400 కోనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి అన్నారు. జిల్లాలో వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని.. రవాణా సమస్యలు తలెత్తకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం