52 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులు సమ్మె విరమించడం... రెండ్రోజుల తర్వాత సీఎం కేసీఆర్ బేషరతుగా కార్మికులు విధుల్లో చేరవచ్చని చెపప్పడంతో కార్మికులు తెల్లవారుజాము నుండే విధుల్లో చేరారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల డిపోల్లో కార్మికులు విధుల్లో చేరేందుకు డ్యూటీ డ్రెస్ ధరించి ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకున్నారు. విధులు నిర్వర్తించేందుకు రిజిస్టర్లో సంతకాలు చేసి తమ రూట్లలోకి బస్సులను తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత బస్సులు నడపడం చాలా సంతోషంగా ఉందని కార్మికులు తెలిపారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు