ETV Bharat / state

గల్ఫ్​ వెళ్లి చేతులు కాల్చుకున్నాడు.. ఒక్క ఐడియాతో జీవితాన్నే మార్చేసుకున్నాడు..! - Jagityal District

కష్ట సుఖాలు, వ్యాధి బాధల్లో జీవితాంతం కలిసి తోడుగా ఉంటానని పెళ్లి సమయంలో చాలా మంది ప్రమాణం చేస్తారు. కానీ దాన్ని కొందరే నిలబెట్టుకుంటారు. అలాంటి వారే జగిత్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు. జీవనాధారం కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలై చివరికి ఒక ఆలోచనతో ప్రస్తుతం సంతోషంగా బతుకుతున్నారీ జంట.

Eetha vanam
Eetha vanam
author img

By

Published : Feb 9, 2023, 9:00 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక శాతం మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తారు. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నుంచి ఈ లెక్క ఎక్కువే ఉంటుంది. ఇదే ప్రాంతానికి చెందిన గంగారం సైతం అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. దీనికోసం అప్పు చేసి బయటి దేశం వెళ్లారు. కానీ అక్కడ జీవితం అనుకున్న విధంగా లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధించేది ఏం లేదు అనుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్నే మార్చింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్​రావుపేటకు చెందిన గుండవేణి గంగారాంకు భార్య సత్తెమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈయనది గీత కార్మిక కుటుంబం. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉండటంతో స్వదేశానికి రావాలని నిర్ణయించుకుని వచ్చారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు తనకు బాగా వచ్చిన కుల వృత్తిని నమ్ముకున్నారు.

స్వగ్రామంలో ఉన్న ఈత చెట్లు ఎక్కి కల్లు గీసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే క్రమంగా వాటిని పట్టాదారులు తొలగించడంతో కుటుంబ పోషణ మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తన ఇంటి ఆవరణలో ఉన్న 6 గుంటల ఖాళీ స్థలంలో 170 ఈత చెట్లను మూడేళ్ల క్రితం నాటారు. వీటిని దంపతులిద్దరూ బాగా చూసుకుంటూ పెంచారు. మరికొన్ని రోజుల్లో ఈ ఈతవనం కల్లు గీయటానికి అనుకూలంగా మారనుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం ఆరు పదుల వయసులోనూ ఓ వైపు ఊరి చివర్లో ఉన్న ఈత చెట్లను గీస్తూనే.. మరోవైపు ఈత వనాన్ని ఆయన పెంచుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకున్నా రూ.70 వేల పెట్టుబడితో వీటిని నాటానని ఆయన చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వాటికి కావాల్సిన ఎరువులు వేస్తూ పెంచుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందితే మరింత మందికి ఉపాధి కల్పిస్తానని అంటున్నారు. ఒకప్పుడు కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి బాధపడ్డామని, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఉంటూ వచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

గ్రామాల్లోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి: రఘునందన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.