మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే సంవత్సరమంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉండగా.. సోమవారం చేపల మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ తెల్లవారుజాము నుంచే ప్రజలతో రద్దీగా కనిపించింది. మత్స్యకారులు మార్కెట్లో వివిధ రకాల చేపలను విక్రయించారు.
మృగశిర కార్తె సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా.. విక్రేతలు ధరను అమాంతం పెంచేశారు. కరోనా విజృంభిస్తున్నా మార్కెట్లో ప్రజలు భౌతిక దూరం మరిచి.. ఒకరిపై ఒకరు పడుతూనే కొనుగోళ్లు జరుపుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకుని వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారు.
ఇవీ చూడండి: కరోనా వేళ.. చేపల కోసం పోటెత్తిన జనం