జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
సుమారు 20వేలకు పైగా భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా నిబంధనల మధ్య పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తున్నట్లు చెప్పారు.
- ఇదీ చూడండి : చింతలు తీర్చే స్వామి... చెన్నకేశవుడు