ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు.. రోడ్లన్నీ జలమయం - జిల్లా కలెక్టర్‌

జగిత్యాల జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు వంతెనలపై వరద నీరు పారుతోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జిల్లాలో సుమారు 999.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు.. రోడ్లన్నీ జలమయం

author img

By

Published : Aug 17, 2020, 2:45 PM IST

జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా గత నాలుగు రోజులుగా వర్షం కురుస్తోంది. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటం వల్ల లోలెవల్‌ వంతెనలపై నీరు పారుతూ పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రోడ్లు జలమయం...

జిల్లాలో నమోదైన 999.2 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతానికి రోడ్లు జలమయమయ్యాయి. అనంతారం వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వంతెన మట్టానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రానికి వంతెనపైకి చేరితే జగిత్యాల-ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. అధికారులు నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పొలాస-గుల్లపేట వద్ద వంతెనపై నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల-సారంగపూర్‌కు వెళ్లే రహదారిలో కోనాపూర్‌ వంతెనపై నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మునిగిన వంతెన...

రాయికల్‌ మండలం మైతాపూర్‌-రాయికల్‌కు వెళ్లే రహదారిలో వంతెన నీట మునిగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.. జగిత్యాల-రాయికల్‌కు వెళ్లే మార్గంలో సింగరావుపేట వంతెన మునగటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వెల్గటూరు మండలం జగదేవుపేటలోని జంగల్‌ నాలా ప్రాజెక్టు నుంచి నీరు మత్తడి పోస్తోంది. పెగడపల్లి మండలాల్లోనూ లోలెవల్‌ వంతెనలపై నీరు పారి రాకపోకలు నిలిచిపోయాయి.

కడెం పరిసరాల్లో అప్రమత్తత...

కడెం ప్రాజెక్టు నుంచి నీటిని కిందికి వదలటం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు పలు మండలాల్లో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కూలాయి అని తెలుసుకునేందుకు అధికారులు అంచనా వేసి పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ రవి అధికారులు నిత్యం సమీక్షిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.