జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా అర్చకులు నిర్వహించారు. పట్టణంలోని పురాతన పంచముఖి కోదండ రామాలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజలు చేశారు.
విశేష పంచామృతాభిషేకం, అభిషేకం నిర్వహించిన అనంతరం 108 తమలపాకులను స్వామివారికి సమర్పించారు. హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం భక్తి శ్రద్ధలతో పఠించారు. ఈ సందర్భంగా మహాహరతి ఎంతో ఆకట్టుకుంది. వచ్చే హనుమాన్ జయంతి వరకు కరోనా పోవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి