ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో త్రిదండి చిన జీయర్ స్వామి, ఉత్తర భారతానికి చెందిన సంపూర్ణనంద స్వామి పాల్గొని భక్తులకు మార్గదర్శనం చేశారు. రెండు గంటల పాటు ఈ హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇవీ చూడండి: ప్రేమికులకు సర్ప్రైజ్ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?