జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వ సూచనల మేరకు సన్నారకం ధాన్యాన్ని పండిస్తే వాటిని పట్టించుకునే వారు కరువయ్యారంటూ... రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ... మండల కేంద్రంలో రైతులు ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ధాన్యం పండించినప్పటికీ... ఏ ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో వచ్చి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీ వర్షాలతో చాలా నష్టపోయామని వర్షాలతో పాటు దోమ పోటు రావడంతో పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులపై కనికరం చూపి ధాన్యానికి మద్దతు ధర అందిస్తూ వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
- ఇదీ చూడండి: 'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'