జగిత్యాల జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్-జగిత్యాల రహదారిని ఆనుకుని ఉన్న వరద కాల్వ కోతకు గురైంది. మల్యాల మండలం నూకపల్లి వద్ద సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
మరింత వరద ప్రవాహంతో..
ఫలితంగా మరింత వరద నీరు వచ్చి కాల్వలోకి చేరుతోంది. ఈ క్రమంలో కాల్వ ఒడ్డు మొత్తం కోసుకుపోయింది. ప్రమాదవశాత్తు ఒడ్డు తెగిపోతే లోతట్టు ప్రాంతాలకు, పంట పొలాలకు ముప్పు పొంచి ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేశారు.
'ఇకనైనా మేల్కొనండి అధికారులూ ' ..
అధికారులు వెంటనే స్పందించి వరద కాల్వకు మరమ్మతులు చేయించాలని అన్నదాతలు కోరుతున్నారు.