ETV Bharat / state

'నియంత్రిత సాగు విధానంపై రైతులకు వివరించాలి'

నూతన సాగు విధానం, కాలువల పూడిక తీతపై ప్రజా ప్రతినిధులతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్షలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.

చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించాలి : మంత్రి ఈశ్వర్

author img

By

Published : May 27, 2020, 1:27 PM IST

నియంత్రిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మంగా నిర్మించిన కాళేశ్వరం నీటిని చివరి ఆయకట్టుకూ అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కాలువ పూడికతీత కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, నేతలు సహకరించాలని మంత్రి కోరారు.

చివరి భూమి వరకూ నీరందాలి : మంత్రి ఈశ్వర్

ప్రస్తుత వేసవి కాలంలో కాలువల పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. చివరి భూముల వరకూ నీరందించాలని యంత్రాంగానికి సూచించారు. నూతన సాగు విధానంపై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం సూచించిన పంటను వేసేలా రైతులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి : మటన్ వ్యాపారి ఇంట పార్టీ.. 22 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.