పసుపు పంటకు రూ. 15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన రైతులు కలిసి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మద్దతు ధర ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చోవడం వల్ల పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.
ఇవీ చూడండి: కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు