Exercise With Dance in Sarangpur Kasturba Gandhi School : ఆ పాఠశాలలో విద్యార్థినులు ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలైన విషయం. అందరిలా కాకుండా వారితోటి, ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సరికొత్తగా ఎక్సర్‌సైజ్ చేయిస్తున్నారు. రోజు వారీ శిక్షణలో భాగంగా పాటలు పెట్టుకొని, డ్యాన్స్ చేస్తూ వ్యాయామం చేయించడం ఇక్కడి ప్రత్యేకత. ఇదెక్కడో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.
Laughing Club : హాహాహాహా.. అంటూ నవ్వితే.. ఆరోగ్యం మీ సొంతం
Sarangpur Kasturba Gandhi School in Jagtial District : కనిపిస్తున్న ఈ విద్యార్థినులు, సారంగపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో (Sarangpur Kasturba Gandhi School) చదువుతున్నారు. ఇక్కడ 221 మందికి ఎక్సర్‌సైజ్, యోగా, క్రీడల్లో ప్రతి రోజు శిక్షణ ఇచ్చేందుకు పీఈటీని నియమించారు. వారికి వ్యాయామం శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థినులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా కారులుగా తీర్చిదిద్దుతున్నారు వ్యాయామ ఉపాధ్యాయురాలు వాణి. ఆమె సాధారణ పద్ధతిలో కాకుండా సంగీతంతో పిల్లలను ఉత్సాహపరుస్తూ యోగా, వ్యాయామం చేయిస్తున్నారు. ప్రతి రోజు యోగాసనాలు, నృత్యంతోనే వ్యాయామం చేపిస్తున్నారు.
"యోగా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రీడలు ఆడటం వల్ల మానసికంగా ధృడంగా ఉండవచ్చు. ఇతరుల పట్ల సహకారభావాన్ని పెంచుకోవచ్చు. ఆటల్లో గెలుపోటములు ఉన్నట్లుగానే, జీవితంలో కూడా గెలుపోటములు సహజమని తెలుసుకుంటారు. యోగా, ఎక్సర్‌సైజ్, క్రీడలు చేసేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు." - వాణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు
మీ ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ మార్గాలు ట్రై చేయండి!
శారీరక ధృడత్వంతో పాటు మానసికంగా కూడా ధృడంగా ఉంటున్నాం : పీఈటీ తమను రోజు ఎంతో ఉత్సాహపరుస్తూ వ్యాయామం చేపిస్తారని విద్యార్థినులు చెబుతున్నారు. పాటల ద్వారా ఎక్సర్‌సైజ్ చేయించడం తమకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుందని వారు అంటున్నారు. తద్వారా తాము శారీరక ధృడత్వంతో పాటు మానసికంగా కూడా ధృడంగా ఉంటున్నామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా, రాష్ట్ర క్రీడలలో పోటీ పడగలుగుతున్నామని పేర్కొంటున్నారు. అందులో పాఠశాల తరఫున అవార్డులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థినులు అంటున్నారు.
"ప్రతిరోజు వ్యాయామం, యోగా చేస్తాం. ఇవి చేయడం వల్ల మానసికంగా ఎంతో ఆనందంగా ఉంది. రోజు పాటలు వింటూ నృత్యం చేస్తాం. ఇలా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండగలుగతున్నాం.ఇతరుల పట్ల సహకారభావాన్ని పెంచుకుంటున్నాం. ఆటలు ఆడటం వల్ల క్రీడా స్పూర్తిని పొందుతున్నాం. అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాం. పాఠశాల తరఫున అవార్డులు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది." - విద్యార్థినులు
International Yoga Day 2023 : ఒకేసారి 1.53లక్షల మందితో యోగా.. సూరత్ గిన్నిస్ రికార్డ్
Aqua Yoga In Jagtial : వారేవ్వా..!!! 63 ఏళ్ల వయసులో నీటిపై యోగాసనాలు