ETV Bharat / state

కోరుట్ల మార్కెట్లో ఎలక్ట్రిక్​ బైకులు.. ఆసక్తిగా తిలకించిన యువత

కాలుష్య నియంత్రణలో భాగంగా రూపొందించిన ఎలక్ట్రికల్ బైకులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీవో శ్యామ్​ నాయక్​ ఎలక్ట్రిక్​ బైక్​ కొన్న యువకుడికి రిజిస్ట్రేషన్​ చేసి.. బైక్​ అందజేశారు. కాగా.. ఎలక్ట్రిక్​ బైకును పట్టణ యువకులు ఆసక్తిగా తిలకించారు.

Electric Bikes Available in Jagitial District
కోరుట్ల మార్కెట్లో ఎలక్ట్రిక్​ బైకులు.. ఆసక్తిగా తిలకించిన యువత
author img

By

Published : Aug 3, 2020, 9:33 PM IST

కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ బైకులు దోహద పడతాయని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్యామ్ నాయక్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో అయిలాపూర్ గ్రామానికి చెందిన పిడుగు కార్తీక్ నూతనంగా కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ బైకులకు రిజిస్ట్రేషన్ ప్రారంభించి ఆర్టీవో శ్యామ్​ నాయక్​ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వినియోగించుకొని ఎలక్ట్రిక్​ బైకులను కొనుగోలు చేసుకోవాలని రవాణా శాఖ అధికారి ప్రజలకు సూచించారు. తొలిసారి మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రికల్ బైకులను యువకులు ఆసక్తిగా గమనించారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.