ETV Bharat / state

జగిత్యాలలో కొత్తగా 8 కొవిడ్​ పాజిటివ్‌ కేసులు

జగిత్యాలలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 23 చేరింది.

author img

By

Published : May 20, 2020, 7:55 PM IST

eight new corona positive cases found in jagtial
జగిత్యాలలో కొత్తగా 8 కొవిడ్​ పాజిటివ్‌ కేసులు

జగిత్యాల జిల్లాలో బుధవారం కొత్తగా ఎనిమిది కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యయి. ముంబయి నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్​ కేసులు వచ్చాయని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌ తెలిపారు. జగిత్యాలలో ఒకరికి, వెల్గటూరు మండలంలో ముగ్గురు, బుగ్గారం, కోరుట్ల మండలాల్లో ఇద్దరి చొప్పున కరోనా పాజిటివ్​ వచ్చింది. వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీకి తరలిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా.. కొత్తగా నమోదైన వాటితో కలుపుకుని బాధితుల సంఖ్య 23కు చేరింది. వారిలో ముగ్గురు వైరస్​ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం 20 యాక్టివ్‌ కేసులున్నాయి. జిల్లాలో ఒకేసారి 8 కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుల ప్రాంతాల్లో శానిటైజేషన్​, ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు.

ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.