ETV Bharat / state

వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది.. కాపాడేందుకు స్థానికుల ప్రయత్నం - తెలంగాణ వార్తలు

eight members stucked in water
వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది
author img

By

Published : Jul 15, 2021, 6:44 PM IST

Updated : Jul 15, 2021, 8:02 PM IST

17:20 July 15

వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది.. కాపాడేందుకు స్థానికుల ప్రయత్నం

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం వాగులో ఎనిమిది మంది సాతారం గ్రామస్థులు చిక్కుకున్నారు. వివిధ పనుల నిమిత్తం వాగు అవతల వైపు వెళ్లిన ఎనిమిది మంది తిరిగి వస్తుండగా  వాగులో చిక్కుకున్నారు.  వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికుల ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారి కోసం గలింపు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపునకు ఇబ్బంది కలుగుతోంది. వాగులో చిక్కుకున్న వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇదే వాగు అవతలివైపు వేంపల్లి గ్రామానికి చెందిన కాశన్న అనే వ్యక్తి వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. గల్లంతైన కాశన్న కోసం రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి: భారత సరిహద్దులో చైనా శాశ్వత శిబిరాలు

Last Updated : Jul 15, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.