వైభవంగా ధర్మపురి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డోలోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యోగా నరసింహ స్వామి పల్లకిలో మేళ తాళాలతో బ్రహ్మపుష్కరిణికి చేరారు. అర్చకులు స్వామి వారికి హంస వాహనంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారిని మంటపంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.ఇవీ చూడండి:నేడు తెరాస జాబితా విడుదల చేయనున్న కేసీఆర్