జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ ఘటనలో గంగావేణి చిన్నగంగారాం అనే రైతుకు చెందిన 11 మేకలు మృత్యవాత పడ్డాయి. మేకల మృతితో రైతుకు 80 వేల వరకు నష్టం వాటిల్లింది. గతంలోనూ మనుషులపై కూడా శునకాలు దాడి చేశాయని... కుక్కల బెడదనుంచి తప్పించాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: వరుస దొంగతనాలకు హడలుతున్న నిజామాబాద్వాసులు