ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి రానున్నారు. ఏ రోజు వస్తారన్న స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ధర్మపురి రానున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాచారం మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ పార్కింగ్ కోసం వక్ఫ్ భూమిని చదును చేస్తున్నారు. జిల్లా పాలనాధికారి శరత్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ఉంచాలని ఆదేశించారు. రహదారి వెంట మొక్కలు నాటాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదిని పరిశీలించే అవకాశం ఉన్నందున పుష్కర గాట్ల వద్ద తగిన ఏర్పాట్లను చేయాలన్నారు.
ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ