జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని అర్బన్ కాలనీలో జిల్లా ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని.. తెలియని వారికి ఆశ్రయం ఇవ్వరాదని ఎస్పీ సింధూ శర్మ ప్రజలకు సూచించారు. తనిఖీల్లో జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ, ముగ్గురు సీఐలు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆరోగ్యశ్రీ బంద్... 'గాంధీ'లో కిటకిట