ETV Bharat / state

పురుగుల మందు తాగాడు... ప్రాణం నిలిపిన డయల్ 100 - జగిత్యాల జిల్లా వార్తలు

డయల్​ 100 ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు పోకుండా రక్షించిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Dail 100 Saves  Young Man Life in Jagitial
ప్రాణం నిలిపిన డయల్ 100
author img

By

Published : Jul 19, 2020, 10:36 PM IST

అత్యవసర సమయంలో 100కు డయల్‌ చేయాలని సూచించే పోలీసులు.. సకాలంలో స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. కరీంనగర్‌ జిల్లా నగునూరు గ్రామానికి చెందిన అలుకుంట రవితేజ అనే 19 ఏళ్ల యువకుడు జగిత్యాల మండలం నల్లగుట్ట వద్ద పురుగుల మందుతాగి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే డయల్‌ 100కు ఫోన్​ చేసి సమాచారం అందించాడు.

వెంటనే స్పందించిన జగిత్యాల రూరల్‌ ఎస్సై సతీష్‌, బ్లూకోట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనంలో ఆ యువకుడిని జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడం వల్ల ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ కలహాలతో సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.