జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ళ బావి సమీపంలో ఉంటున్న నకాసి కళాకారులు 40 ఏళ్లుగా పులి పుర్రెలు తయారు చేస్తున్నారు. మట్టి, చింత గింజలు, కర్ర పొట్టుతో తయారు చేస్తున్న ఈ పుర్రెలు అందంగా.. చూడ ముచ్చటగా ఉంటున్నాయి. జగిత్యాల ప్రాంతంలో పది రోజుల పాటు సాగే మొహర్రం వేడుకలకు ఇక్కడి నుంచే పుర్రెలు కొనుగోలు చేసి తీసుకెళతారు. వేడుకలలో ఈ పుర్రెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదీ చూడండి : 'ప్రతీ నిరుపేదకి ఇళ్లు వచ్చేంతవరకు తెదేపా పోరాడుతుంది
.