Crowds Lined Up at Gas Agencies in Metpally : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో (Congress Six Guarantees) ఒకటైన రూ.500 సిలిండర్ పొందాలి అంటే ఈ-కేవైసీ అప్టేడ్ చేసుకోవాలి వస్తున్న అసత్య ప్రచారానికి మెట్‌పల్లిలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచి లైన్ కట్టి తమ కేవైసీని అప్టేడ్ చేయించుకుంటున్నారు.
'ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన జీవన్‌రెడ్డి'
దీంతో నిత్యం చేసుకునే పని చేసుకోలేకపోతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఈకేవైసీకి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పినా ప్రజలు వినడం లేదని సిబ్బంది తెలిపారు. గ్యాస్ కనెక్షన్‌కు కేవైసీ ఎప్పుడైనా అనుసంధానం చేసుకోవచ్చని, దానికి చివరి గడువు లేదని గ్యాస్ కార్యాలయ సిబ్బంది అన్నారు. ఇదిలా ఉంటే మరోవైరు ప్రజలు ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నా వినిపించుకోకుండా సమస్యలు లేకుండా సమయాన్ని కేటాయించి ఈ-కేవైసీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్యాస్ కనెక్షన్‌కు కేవైసీ అప్డేట్ చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"కేవైసీ చేస్తేనే రూ.500 సిలిండర్ ఇస్తారు అంటేనే నేను ఇక్కడికి వచ్చాను. ఏజెన్సీ దగ్గర చాలా లైన్ ఉంది. రెండు రోజుల నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం ఈ సమయం వరకు చేస్తామంటే మేము వచ్చి అప్డేట్ చేసుకుని పోతాం. గ్యాస్ 500లకు రావాలంటే కేవైసీ చాలా ముఖ్యం అంటున్నారు." వినియోగదారుడు
Crowds Lined Up at Gas Agencies in Adilabad : కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ ఇస్తామన్న ప్రకటన అమలు కాక ముందేే జనాలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని గతకొన్ని రోజులుగా గ్యాస్ ఏజెన్సీలు ఈకేవైసీ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మారడం వల్ల ఈకేవైసీ రూ.500 సబ్సిడీ గ్యాస్ కోసమేననే భావనతో కనెన్షనుదారులు ఏజెన్సీల ముందు వరుస కడుతున్నారు.
Bhatti people's March Today : 'అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్'
"కేవైసీ అనేది కంపెనీ నిబంధన దాని ప్రకారం రోజు కొన్ని చేసుకోవాలి. కాని కస్టమర్లు 14,500 మంది ఉన్నారు. ఒకేసారి అందరివి చేయాలి అంటే ప్రక్రియ కాదు. రోజు కొన్ని చేసుకుంటూ పోవాలి. ఎప్పటివరకు అన్ని టైం ఏం లేదు. ఉజ్వల వినియోగదారులు మాత్రం మార్చి 31వరకు కేవైసీ చేసుకోవాలి. రూ.500 దానికి ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టలేదు" గాంధీ, హెచ్.పీ గ్యాస్ మేనేజర్
జనాలు ఎక్కువగా వస్తుండటంతో రోజుల వారీ టోకెన్లు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అమలుచేసే 500 సిలిండర్ పథకానికి, ఈకేవైసీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడంలేదని, తమ దుకాణాల ముందు వచ్చి బారులు తీరుతున్నారని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు వృద్దులు మొదలుకొని, చంటిపిల్లలతో తల్లులు, మహిళలు ఈకేవైసీ కోసం ఉదయమే వచ్చి ఏజెన్సీల ముందు నానా తంటాలు పడుతున్నారు.
రెండోరోజూ నిరసనలు.. గ్యాస్ సిలిండర్‌ను ఉరి తీసి, పాడె కట్టిన బీఆర్ఎస్ నేతలు