జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతున్నది. అప్రమత్తమైన అధికారులు కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం 27 మందికి కరోనా టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్ అని తేలింది.
పెరుగుతున్న పాజిటివ్ కేసుల పట్ల ఆందోళన చెందుతున్న ప్రజలకు అధికారులు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. పురపాలికలోని చైతన్యనగర్, రెడ్డికాలనీకి, మార్కెట్ ఏరియాలో కలిపి ముగ్గురు, రామ్‌నగర్‌లో ఓ గర్భిణికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు 128 టెస్టులు చేయగా 27 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా బాధితుల నివాస ప్రాంతాల్లో పురపాలక అధికారులు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. స్థానిక ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి.. అవగాహన కల్పించారు.