ETV Bharat / state

82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​ - 75 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

corona-positive-for-15-students-in-jagtial-gurukul-school
43 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Mar 19, 2021, 1:46 PM IST

Updated : Mar 19, 2021, 7:25 PM IST

13:44 March 19

82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇవాళ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 82 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. 

మద్నూర్ గురుకులంలో

కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషికి కరోనా రావడంతో విద్యార్థులు, ఉపాద్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురుకుల పాఠశాలలో 170 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.

ఎస్టీ బాలుర వసతి గృహంలో

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ ఎస్టీ బాలుర వసతిగృహంలో తాజాగా 22 మందికి కరోనా పాటిజివ్​ వచ్చింది. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వాచ్‌మెన్‌కు కూడా కొవిడ్​ నిర్ధరణ అయింది. నిన్న 92 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా వచ్చినవారికి హాస్టల్‌లోనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చినవారిని అధికారులు ఇళ్లకు పంపించారు.

ఐసోలేషన్​లో ఉంచుతాం

జగిత్యాల సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలో 22 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ జయ్​పాల్ రెడ్డి తెలిపారు. భవానీనగర్​లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జ్వరంతో బాధపడుతున్న 22 మందికి పైగా విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 17 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు మహమ్మారి బారిన పడినట్లు వెల్లడించారు. మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులుండగా.. ఇంకా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశముందని జయ్​పాల్ రెడ్డి వివరించారు. కరోనా సోకిన వారికి అదే పాఠశాలలోని ఓ గదిలో ఐసోలేషన్​లో ఉంచుతామని జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. విద్యార్థులకు కొవిడ్ సోకడం వల్ల వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.  

ఇళ్లకు తీసుకెళ్లాలని

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలో 15 మందిలో కరోనా వైరస్​ ఉన్నట్లు గుర్తించారు. 62 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. కరోనా వచ్చిన విద్యార్థుల కోసం కస్తూర్బా పాఠశాలలోనే  ఓ గదిలో అసోసియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొవిడ్​ వచ్చిన విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లాలని పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్, అధికారులు సమాచారం అందించారు. కరోనా వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్లగా.. మిగిలిన విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యులు వెల్లడించారు.

ఆదర్శ పాఠశాలలో

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ఆదర్శ పాఠశాలలో 12 మందికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్ వచ్చినట్లు నిర్ధరణ అయింది.

పీజీ విద్యార్థినులకు

హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్శిటీ వసతి గృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినులకు కొవిడ్​ నిర్ధరణ అయింది. చికిత్స కోసం విద్యార్థినులను కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. ఓయూ వసతి గృహాలను అధికారులు శానిటైజ్‌ చేస్తున్నారు. ఓయూ వసతి గృహంలో ప్రస్తుతం 400 మంది విద్యార్థినులు ఉంటున్నారు.

గురుకుల పాఠశాలలో

నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో నలుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. 18 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కొవిడ్​ నిర్ధరణ అయింది.  

ఇదీ చూడండి : విషాదం: గోదావరిలో పడి ముగ్గురు మృతి

Last Updated : Mar 19, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.