జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రిక్షాలు తొక్కుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇంధన ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.
పెంచిన ధరలు తగ్గించి, సామాన్య ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు.