ETV Bharat / state

జగిత్యాల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్​ తనిఖీలు - జగిత్యాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జగిత్యాల జిల్లా రాయికల్​, మల్లాపూర్​ కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్​ రాజేశంతో కలిసి కలెక్టర్​ రవి తనిఖీ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు
author img

By

Published : May 4, 2020, 7:59 PM IST

జగిత్యాల జిల్లా రాయికల్​, మల్లాపూర్​ మండల కేంద్రాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్​ రాజేశంతో కలిసి కలెక్టర్​ గుగులోతు రవి తనిఖీ చేశారు. అదేవిధంగా అల్లీపూర్‌, ఉప్పుమడుగు, మైతాపూర్‌, ఇటిక్యాల, మల్లాపూర్‌, గొర్రెపల్లి, కుస్తాపూర్‌, రాఘవపేట గ్రామాల్లోని కేంద్రాలను సైతం ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రైతులు... కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తేమశాతం రాగానే కొనుగోళ్లు చేయాలని... మిల్లర్లు ధాన్యం దింపుకోకపోతే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మిల్లుల్లో ఏమైనా సమస్యలుంటే తమకు చెప్పాలని... వారిపై చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్​ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: రైల్వే పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.